చిత్తూరు జిల్లా అంగల్లులో చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అనుమనుహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే  అత్యాచారం చేసి హత్య చేసాడా లేదా మరి ఎవరితోనైనా కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పాడి ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమన్నారు.

కాకినాడలో దారుణం:రెండు రూపాయాల కోసం సువర్ణ రాజు హత్య

రెండు రోజుల క్రితం అంగల్లులో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బి.కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు తమ ముగ్గురు కుమార్తెలతో కలసి  బంధువుల వివాహానికి అంగళ్లులకు వెళ్లారు. ఇద్దరు పిల్లలు తల్లితో  కలిసి ఉండగా మూడో కుమార్తె(6)  ఆడుకుంటూ  బయటకు వచ్చింది. 

చిన్నారి వర్షిత హత్య: లైంగిక దాడి, హంతకుడు కర్ణాటకవాసి?

ఆ సమయంలో ఓ అగంతకుడు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు, రాత్రి పదిగంటల సమయంలో బాలిక కనిపించకపోవడంతో అంతా  వెతికారు.
చిన్నారి కనిపించకపోవడంతో  ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు శుక్రవారం ఆ బాలిక కల్యాణ మండపం సమీపంలోనే  శవమై కనిపించింది.
చిన్నారి మృతదేహన్ని పరిశిలించిన పోలీసులు  అత్యాచారం చేసి, హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. 

బాలిక మృతితో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి, బాధితులను వెంటనే అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేశాయి.

 .