కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. రెండు రూపాయాల కోసం సువర్ణరాజు అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

కాకినాడ రూరల్ మండలంలో వలసపాకలలో ఈ ఘటన చోటు చేసుకొంది. సువర్ణరాజు అనే వ్యక్తి తన సైకిల్‌లో గాలిని నింపుకొనేందుకు సాంబ అనే వ్యక్తికి చెందిన సైకిల్ రిపేర్ షాపు వద్దకు వెళ్లాడు.

సువర్ణ రాజు తన సైకిల్‌లో గాలిని నింపుకొన్న తర్వాత గాలిని నింపుకొన్నందుకు గాను రెండు రుపాయాలు ఇవ్వాలని  సువర్ణరాజును సాంబ అడిగాడు.
సైకిల్‌ టైర్లలో గాలిని నింపుకొన్నందుకు గాను డబ్బులు అడుగుతావా అంటూ సువర్ణ రాజు సైకిల్ షాపు యజమాని సాంబతో గొడవకు దిగాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.

ఈ సమయంలో  సైకిల్ షాపు యజమాని సాంబను సువర్ణరాజు కొట్టాడు. అదే సమయంలో అక్కడే ఉన్న సాంబ మిత్రుడు అప్పారావు సువర్ణరాజును కత్తితో పొడిచాడు. 
దీంతో సువర్ణరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సువర్ణరాజును వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతి చెందినట్టుగా  పోలీసులు తెలిపారు.

Also read:అమ్మాయిలతో రాసలీలల ఆడ పిశాచి: వెలుగులోకి దిమ్మతిరిగే విషయాలు

ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  సువర్ణ రాజుకు ,సాంబకుపాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

ఈ ఘటనతో సువర్ణరాజు కుటుంబంలో విషాదం నెలకొంది. సువర్ణరాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సువర్ణరాజు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.