తిరుమల పవిత్రతను దెబ్బతీసేందకు వైసిపి కుట్రలు...: బోండా ఉమామహేశ్వరరావు
తిరుమల పవిత్రతను, హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా పథకం ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇందుకు తిరుమలలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనమన్నారు.
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల విశ్వాసాలను, వారి మనోభావాలను కాలరాసే విధంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రికలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వ పెద్దలు నెపం మోపుతున్నారన్నారు.
తిరుమల పవిత్రతను, హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా పథకం ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు తిరుమలలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనమన్నారు. తిరుమల ఏడుకొండలు కాదు.. రెండు కొండలే అన్న తన తండ్రి వైఎస్ బాటలోనే తనయుడు జగన్మోనహన్‌రెడ్డి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
'శ్రియై నమః' అనే పదం గూగుల్‌లో శ్రీ యేసయ్య మారిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇవ్వడం వింతగా ఉందని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోందన్నారు.
read more రౌడీ మంత్రులతో కలిసి జగన్ అసమర్ధ పాలన...రావణకాష్టంగా రాష్ట్రం: తులసి రెడ్డి
ఇటీవల తిరుమల కొండపై శిలువ గుర్తు వెలవడం, టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్ చేయడం, టీటీడీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం, హిందూ దేవాలయాల్లో అన్యమతస్థుల నియామకం, అమరావతిలో శ్రీవారి ఆలయానికి నిధుల తగ్గింపు, దేవాలయాల భూముల అమ్మకం వంటివే ఇందుకు నిదర్శనమని అన్నారు.
తిరుమలలో దర్శనం, వసతి, అద్దె, ప్రసాద ధరలు విపరీతంగా పెంచడం, తిరుమలపై మంత్రుల తిట్ల పురాణం, డిక్లరేషన్‌పై సంతకానికి జగన్ నిరాకరణ, మైల ఉన్నప్పుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం వంటి అనేక ఘటనలు ప్రభుత్వ వ్యవహారశైలికి అద్దం పడుతున్నాయని అన్నారు.
read more చంద్రబాబు కోసమే పవన్... హచ్ కుక్కను మించిపోయాడు...: మంత్రి అనిల్
ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదని అన్నారు. తమ కుట్రలను అమలుచేసేందుకు తిరుమలను వివాదాలకు కేంద్ర బిందువుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని...లేనిపక్షంలో శ్రీవారి భక్తులే వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని బోండా ఉమ హెచ్చరించారు.