అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మతి భ్రమించినట్లు మాట్లాడున్నాడని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఫాలో అవ్వడంలో పవన్ హచ్ కుక్కని మించిపోయాడంటూ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. అందుకే ప్రజలు పవన్ నాయుడు, కళ్యాణ్ నాయుడు అంటున్నారని ఎద్దేవా చేశారు. 

పవన్ ని రాజకీయ నాయకుడు అనాలో... నటుడు అనాలో అర్ధం కావడంలేదన్నారు. జగన్ దమ్ము, ధైర్యం గురించి ప్రజలకు తెలుసని... పవన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సత్తా ఏంటో మొన్న ఎన్నికల్లో తెలిసింది కదా అని సైటైర్ వేశారు. 

జగన్ ని ఎలా పిలిచినా తమకు అనవసరమని... పవన్ ని పట్టించుకునేవారు ఎవరూ లేరన్నారు. ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించిన ముఖ్యమంత్రి జగన్ అని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. 

read more  పోలీసులూ జాగ్రత్త... మీకు శిక్ష తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

కులాలు మతాలు లేవంటూనే పవన్ నిత్యం అవే మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్న తన ఫ్యాన్స్ ని ముందు కంట్రోల్ చేసుకోవాలని పవన్ కు సూచించారు. 

పవన్ వల్ల ఏమి కాదని అందరికీ అర్థమయ్యిందని... ఆయన ఎవరి తోలు, తాటలు తియ్యలేరన్నారు. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు  అని గట్టిగా హెచ్చరించారు. ఇలానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదన్నారు. 

read more అమరావతి నిర్మాణం కాదు...ఆ పేరే జగన్ కు నచ్చడంలేదు: వర్ల రామయ్య

2017 లో జరిగిన ఘటనను పవన్ తమపై రుద్దుతున్నాడని... అప్పుడు పవన్ నిద్రపోయాడా..? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా ఆ ఘటనపై పవన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. రేణుదేశాయ్ అడిగిన ప్రశ్నలకు ఇంత వరకూ సమాధానం ఎందుకు చెప్పలేదంటూ పవన్ ను మంత్రి అనిల్ నిలదీశారు.