Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ తీర్పు: లంచ్ మోషన్ దాఖలు చేసిన కేసీఆర్ సర్కార్

ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసులో  సింగిల్ బెంచ్  ఆర్డర్ ను  మూడు వారాల పాటు  సస్పెన్షన్  చేయాలని కోరుతూ   అడ్వకేట్  జనరల్  లంచ్ మోషన్  పిటిషన్ దాఖలు  చేశారు. 

 Telangana Advocate General Files Lunch motion Petition In Telangana High Court over Single bench verdict suspension
Author
First Published Feb 7, 2023, 11:59 AM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో   సింగిల్  బెంచ్ ఆర్డర్ ను మూడు వారాల పాటు సస్పెన్షన్  చేయాలని కోరుతూ  హైకోర్టు సింగిల్ బెంచ్ లో  పిటిషన్ దాఖలు  చేశారు  అడ్వకేట్ జనరల్.   సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇవ్వాలని  ఆ పిటిషన్ లో  అడ్వకేట్ జనరల్ కోరారు.   సుప్రీంకోర్టుకు  వెళ్లే వరకు  ఈ ఆర్డర్ పై  స్టే ఇవ్వాలని  అడ్వకేట్  జనరల్   ఆ పిటిషన్ లో  ప్రస్తావించారు.   ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను  హైకోర్టు సింగిల్ బెంచ్  విచారణకు స్వీకరించింది.  ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు  ఈ పిటిషన్ పై  హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ నిర్వహించనుంది. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను  సీబీఐకి అప్పగిస్తూ  సింగిల్ బెంచ్  ఉత్తర్వులను  డివిజన్ బెంచ్ లో  కేసీఆర్ సర్కార్  ఈ ఏడాది జనవరి  4వ తేదీన  సవాల్  చేసింది. ఈ పిటిషన్ పై  నిన్న  హైకోర్టు  డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించింది.  హైకోర్టు సింగిల్ బెంచ్  ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్  కూడా సమర్ధించింది.  

సింగిల్ జడ్జి  పరిధిలోని క్రిమినల్ కేసుల విచారణ తమ పరిధిలోకి  రాదని  నిన్న  డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ విషయమై  ఏదైనా ఉంటే  సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు డివిజన్ బెంచ్   నిన్న  అడ్వకేట్ జనరల్  కు సూచించింది.  అయితే  తాము ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లే వరకు  తీర్పు అమలును నిలిపివేయాలని  అడ్వకేట్  జనరల్  కోరారు. కానీ ఇందుకు   హైకోర్టు డివిజ్  బెంచ్ నిరాకరించింది . 

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును సీబీఐ విచారణకు  అప్పగిస్తూ  2022 డిసెంబర్  26వ తేదీన  తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.  తాము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు  ఈ ఆర్డర్ పై సస్పెన్షన్ ను విధించాలని  తెలంగాణ హైకోర్టును  అడ్వకేట్ జనరల్  కోరారు.  లంచ్ మోషన్ పిటిషన్ లో ఇదే విషయాన్ని కోరారు.   ఇవాళ మధ్యాహ్నం  ఈ పిటిషన్ పై హైకోర్టు సింగిల్  బెంచ్  విచారణ నిర్వహించనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios