వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు: మీకు తెలుసా?
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ప్రతి సంవత్సరం సరికొత్త ఫీచర్స్ జత చేస్తూ వస్తోంది. యూజర్లకు ఉపయోగపడేలా ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది.
న్యూఢిల్లీ: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ప్రతి సంవత్సరం సరికొత్త ఫీచర్స్ జత చేస్తూ వస్తోంది. యూజర్లకు ఉపయోగపడేలా ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది.
లాక్ చేసిన ఫోన్‌ను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేయొచ్చు. అలా అన్‌లాక్ చేసిన ఫోన్‌లోని వాట్సాప్‌తో సహా చాలా యాప్స్‌ను యథేచ్ఛగా ఎవరైనా వాడవచ్చు. ఇలాంటి వాటికి ఇక వాట్సాప్ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.
ఇక వాట్సాప్‌ను ఓపెన్ చేయాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషణ్(ధృవీకరణ) ఉండాల్సిందే. అంతేకాదు, వాట్సాప్ సందేశాలను స్క్రీన్ షాట్ తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్‌ప్రింట్‌ను యాక్సెస్ చేయాల్సిందే. ఈ ఫీచర్లను వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
అయితే, స్క్రీన్‌షాట్స్‌కు ఫింగర్‌ప్రింట్ ఆప్షన్ తప్పనిసరి కాదు. వినియోగదారులు స్క్రీన్‌షాట్స్ తీయడానికి అనుమతి కావాలా? వద్దా? అన్నది ముందే ఎంచుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటేనే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
ఇటీవల ప్రైవేట్ రిప్లై ఇచ్చే ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 2.18.355 పరిచయం చేయబడింది. ఇది గ్రూప్‌లో ఇతర సభ్యులకు తెలియకుండా ఒక ప్రత్యేక సభ్యుడికి సందేశాలను పంపడానికి అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ బీటా యాప్ యొక్క తాజా అప్డేట్‌ని డౌన్‌లోడ్ ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు.
2019లో పిక్చర్-ఇన్-పిక్చర్(పీఐపీ) వీడియో మోడ్ మొదట ఐఓఎస్ వినియోగదారుల కోసం పరిచయం చేయబడింది. ఆ తర్వాత బీటా వెర్షన్ 2.18.301తో ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం రూపొందించబడింది. ఆ తర్వాత 2019లో వాట్సాప్ వెబ్ పీఐపీ మోడ్ యొక్క మెరుగైన వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీడియోలను మెసేజింగ్ అప్లికేషన్‌లోనే ఒక చిన్న విండో ద్వారా చూడగలిగే చేస్తోంది.
వాట్సాప్ కొత్త తనిఖీ పాయింట్ టిప్ లైన్(+91-9643-000-888)ను ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వేదికపై ఏవైనా తప్పుగా ఉన్న సమాచారం అందజేయవచ్చు. వాట్సాప్ యాప్ టిప్-లైన్‌ని పీఆర్ఓ ప్రోటో అనే పేరుతో మీడియ ప్రాంరభించింది.
అంతేగాక, డూడుల్ యూఐని కూడా వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా స్టికర్స్, ఎమోజీలను స్నేహితులతో పంచుకోవచ్చు. వాట్సాప్ మొదట సందేశ వేదికగా ప్రారంభమై ఇప్పుడు గ్రూప్ వీడియో కాలింగ్, స్టిక్కర్లు తోపాటు ఇతర ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.