స్పెయిన్ టెన్నిస్ సూపర్‌స్టార్ రఫెల్ నాదల్ తన మనసు ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా నాదల్ గురువారం మ్యాచ్ ఆడుతున్నాడు.

స్పెయిన్ టెన్నిస్ సూపర్‌స్టార్ రఫెల్ నాదల్ తన మనసు ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా నాదల్ గురువారం మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సమయంలో బాల్‌ను తన ప్రత్యర్థివైపుకు కొట్టాడు. అయితే అది గురితప్పి నేరుగా అంపైర్ వెనకాల నిలబడ్డ ఓ బాల్‌గాళ్‌కు తగిలింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను రో"హిట్"... కళ్ళు చెదిరే విన్యాసం, వీడియో చూడండి

దీంతో ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లకు సైతం ఏమైందేనని భయంతో గట్టిగా అరిచారు. వెంటనే ఆ అమ్మాయికి దెబ్బ తగిలిందేమోనని భావించిన నాదల్ ఆమెవైపు చూడగా.. తనకు ఏం కాలేదన్నట్లుగా సైగ చేసింది.

అయినా ఆ సమాధానంతో సంతృప్తి చెందని రఫెల్ నాదల్ ఆమెను సమీపించి ఏం కాలేదు కదా అని ఆరా తీశాడు. అనంతరం ఆ బాలిక టోపిని పక్కకు జరిపి, ఆమె బుగ్గపై అప్యాయంగా ముద్దుపెట్టి తలనిమిరి వెళ్లిపోయాడు. ఆ పరిణామానికి స్టేడియంలో ఉన్నవారితో పాటు ఆ బాలిక సైతం ఆశ్చర్యపోయింది.

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రఫెల్ నాదల్... ఆ అమ్మాయి గురించి తనకు చాలా భయం వేసిందని.. ఎందుకంటే ఆ బంతి బలంగా ఆమె తలకు తగిలింది. అయితే అదృష్టం కొద్ది ఆమె తలకు ఎలాంటి గాయం కాకపోవడంతో సంతోషంగా ఉంది. కానీ ఆమె చాలా తెలివైన అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read:ధోనీ అవసరం చాలా ఉంది, కానీ అదంతా కోహ్లీ చేతిలోనే.. సురేష్ రైనా

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రఫెల్ లాంటి సూపర్‌స్టార్ తనంతట తానుగా వెళ్లి ఓ అమ్మాయికి ముద్దు పెట్టడమా అంటూ షాక్‌కు గురవుతున్నారు. మరికొందరు బాల్‌గాళ్‌కు ఏమవుతుందోనని నాదల్ చూపిన మానవత్వం బాగుందని మెచ్చుకుంటున్నారు. 

Scroll to load tweet…