హైదరాబాద్: హైద్రాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్ ను హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ రూ. 10 లక్షలకు కిరాయి హంతకులకు చెల్లించినట్టుగా పోలీసుల దర్యాప్తులో  తేలింది.

హేమంత్ ను ప్రేమించి అవంతి పెళ్లి చేసుకొంది.కులాంతర వివాహం చేసుకొన్నందుకు గాను పరువు హత్య చేయించాడు అవంతి కుటుంబసభ్యులు.

ఈ నెల 24వ తేదీ సాయంత్రం హేమంత్, అవంతిని  మేనమామలు, ఇతర కుటుంంబసభ్యులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.  అదే రోజు సాయంత్రం హేమంత్ ను సంగారెడ్డికి సమీపంలో హత్య చేశారు.

also read:చందానగర్‌లో పరువు హత్య: 12 మంది అరెస్ట్

ఈ హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ చందానగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ ఇద్దరికి రూ. 10 లక్షలను  హత్య కోసం యుగంధర్ ఇచ్చాడని పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో ఇప్పటికీ అవంతి తల్లిదండ్రులతో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు.