హైదరాబాద్: హైద్రాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్  పరువు హత్య కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు శుక్రవారం నాడు ప్రకటించారు.

హేమంత్ తో పాటు ఆయన భార్య అవంతిని చందానగర్ టీఎన్జీఓ కాలనీ నుండి తీసుకెళ్లారని  చందానగర్ పోలీసులు ప్రకటించారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం నాలుగు  గంటల ప్రాంతంలో ఇంటి నుండి వారిని కిడ్నాప్ చేశారన్నారు. 

సాయంత్రం ఆరున్నర గంటలకు హేమంత్ తండ్రి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు ప్రకటించారు. అయితే కారులో తీసుకెళ్లే సమయంలో 100కు సమాచారం ఇచ్చారని ఆయన వివరించారు.

also read:డాడీ... డాడీ... నన్ను ఎత్తుకెళ్తున్నారు...: తండ్రితో హేమంత్ చివరి మాటలు

ఫిర్యాదు అందిన వెంటనే తాము నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అయితే  తాము సంఘటన స్థలానికి చేరుకొనే సమయానికి హేమంత్ ను హత్య చేశారని పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు అందిన వెంటనే తాము స్పందించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో తాము నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని పోలీసులు ప్రకటించారు. హేమంత్ హత్యలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు ఆయన బంధువుల పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. లక్ష్మారెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.