తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పోడు భూముల వ్యవహారంపై ఆమె శనివారం వరుస ట్వీట్లు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పోడు భూముల వ్యవహారంపై ఆమె శనివారం వరుస ట్వీట్లు చేశారు.
‘‘ పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. స్పెషల్ ఫోర్స్ ను పెట్టి మరీ ఆదివాసీల గుడిసెలు పీకేపిస్తున్నాడు. వాట్ ఇస్ వాట్.. వాట్ ఇస్ నాట్ ..
కుర్చీ వేసుకొని మరి పోడు భూముల లెక్క తేల్చుతా అని, ఈరోజు వాళ్లకు నీడ - గూడు లేకుండా.. ఆడవాళ్ళు అని చూడకుండా ఒంటి మీది గుడ్డలు ఊడిపోతున్నా చూడకుండా ఈడ్చి పడేపిస్తున్నారు. న్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టించారు. య్యాల ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు.పోడు పట్టాల కోసం పోరాడుతున్న ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రను చేసిన పాలన మీ నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ఠ. ఇది మీ పతనానికి సంకేతం. మీ పాలనకు ముగింపు’’ అంటూ షర్మిల (ys sharmila) ట్వీట్ చేశారు.
ఇకపోతే.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ (ys vijayamma) రాజీనామా చేయడంపై శుక్రవారం మీడియా ప్రతినిధులకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు షర్మిల. ఈరోజు రాజశేఖర్ రెడ్డి జయంతి (ys rajasekhara reddy birth anniversary) అని.. ఎక్కడో ఏదో జరిగిందని, తనను ప్రశ్నలు అడిగి .. నేను దానికి సమాధానాలు చెప్పి, మీరు వాటినే హాట్ టాపిక్‌గా చేస్తే అది వైఎస్‌ను అవమానించడమేనని షర్మిల అన్నారు. వైఎస్ పేరు ఒక బ్రాండ్ అని.. దీనిని కేసీఆర్ ముప్పుగా భావిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను సన్మానిస్తున్నారు గానీ.. వైఎస్‌ను చేయడం లేదంటే దానికి అర్ధం అదేనని షర్మిల అన్నారు. వైఎస్ కుటుంబంలోని వ్యక్తిగా కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు కూడా ఆయన మెమోరియల్ కోసం స్థలం కావాలని అడిగామని... ఇప్పటికీ ప్రయత్నిస్తున్నామని షర్మిల చెప్పారు.
Also Read:వైసిపీకి అమ్మ రాజీనామాపై వైఎస్ షర్మిల షాకింగ్ రియాక్షన్
ఇప్పుడు తాను తెలంగాణలో పార్టీ పెట్టానని.. ఈ విషయంలో బలంగా పోరాడుతున్నానని ఆమె తెలిపారు. రేవంత్ చెప్పే మాటలు ఎవరు నమ్ముతారని , రోశయ్య కంటే గొప్ప నేత కాదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనాడు ఒక టెరరిస్ట్ లాగా మాట్లాడారని.. అందుకే తెలంగాణ ఏర్పాటు జరిగితే హైదరాబాద్ కు ఫ్లైట్ లో రావాలని వైఎస్ అన్నారని షర్మిల గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందని షర్మిల అన్నారు.
ప్రస్తుత టీఆర్ఎస్ భవన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని .. కానీ కేసీఆర్ సీఎం అయిన వెంటనే వైఎస్ కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గౌరవార్ధం తక్షణమే స్థలాన్నికేటాయించాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో వున్న సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ లను లీడర్లుగా చేసింది వైఎస్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇవాళ వైఎస్‌ఆర్ జయంతి కాబట్టి... వైఎస్సాఆర్ మెమోరియల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు షర్మిల తెలిపారు. తాను ఏదో ఒకటి మాట్లాడితే.. అదే హైలెట్ చేస్తారంటూ తన సోదరుడు జగన్ గురించి ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు షర్మిల.
