వైఎస్ఆర్‌టీపీ  చీప్  వైఎస్ షర్మిల  అస్వస్థతకు గురయ్యారు. టీఓస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి  షర్మిల  ప్రయత్నించడంతో  ఆమెను  పోలీసులు అరెస్ట్  చేశారు.  

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీప్ వైఎస్ షర్మిల శుక్రవారంనాడు అస్వస్థతకు గురయ్యారు.టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి షర్మిల ప్రయత్నించారు దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ ఆఫీస్ ముట్టడికి షర్మిల యత్నం: రోడ్డుపై బైఠాయింపు, ఉద్రిక్తత

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ ఇవాళ నిరసనకు వైఎస్ఆర్‌టీపీ పిలుపునిచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నార. షర్మిల టీఎస్‌పీఎస్ సీ కార్యాలయం ముందు బైఠాయించారు . షర్మిల సహా ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన సమయంలో షర్మిలను పోలీసులు వాహనంలో తరలించారు. ఈ సమయంలో షర్మిల స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం.