Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి పోయిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు.. కేసీఆర్ పై షర్మిల సెటైర్లు...

 ‘ఓ దిక్కు రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకుని.. వర్షాలకు తడుస్తుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతుంటే.. కల్లాలు చెరువులై తే చూసి తట్టుకోలేక కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే.. మీ హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని ధర్నా డ్రామాతో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలా. ఇకనైనా యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి..’ 

YSRTP Chief YS Sharmila Satirical Tweets on KCR Over Delhi tour
Author
Hyderabad, First Published Nov 25, 2021, 11:16 AM IST

హైదరాబాద్ : కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన విషయంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు YS Sharmila మరోసారి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. *మూడు గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడో, పేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ..మూడేండ్లు కర్రసాము నేర్చుకుని మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరుగా అయిందని, ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడని’ ఎద్దేవా చేశారు.

‘అపాయింట్ మెంట్ లేకుండానే ఢిల్లీకి పోయి ఏం పొడుద్దామనుకుని పోయారు?’ అంటూ ప్రశ్నించారు. ‘ఓ దిక్కు farmers కల్లాల్లో ధాన్యం పెట్టుకుని.. వర్షాలకు తడుస్తుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతుంటే.. కల్లాలు చెరువులై తే చూసి తట్టుకోలేక కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే.. మీ huzurabad ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని dharna drama తో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలా. ఇకనైనా యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి..’ అంటూ విరుచుకుపడ్డారు. 

YS Sharmila: ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మోసం చేస్తున్నారు.. కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

దీంతో పాటు ఈ రోజు రెండు దినపత్రికల్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ‘ఏమీ తేల్చలే..’ అని,  ‘వెళ్లారు.. వచ్చారు’ అనే హెడ్డింగ్ లతో పేపర్లో వచ్చిన రెండు ఆర్టికల్స్ ను షేర్ చేస్తూ మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా,  రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ. 3 లక్షల పరిహారం అందిస్తామని cm kcr ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణలోని విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం మంచిదే అని.. కానీ తెలంగాణ ప్రజల సంగతేంటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణ రైతులు మరణిస్తే పరిహారం ఎందుకు ఇవ్వలేదని.. టీపీసీసీ అధ్యక్షుడు revanth reddy తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు bandi sanjayలు సర్కారును ప్రశ్నించారు. తాజాగా ysrtp అధ్యక్షురాలు ys sharmila కూడా నవంబర్ 22న కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ.. వరుసగా ట్వీట్స్ చేశారు.

ట్విట్టర్ వేదికగా మరోసారి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.’’ కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట..! బయటి రాష్ట్రం రైతులకు మూడు లక్షల రూపాయలు ఇస్తారా..? మన రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారికి , ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సార్..? తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా..?‘‘ అని సీఎం కేసీఆర్ ను పరోక్షంగా వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అభయహస్తం డబ్బులు చెల్లిస్తామని.. స్త్రీల సంక్షేమానికి, సాధికారతకు కృషి చేస్తామని షర్మిల వెల్లడించారు. 

‘కష్టపడి పండించిన పంట కండ్ల ముందు కొట్టుకుపోతుంటే.. మొలకలొచ్చిన ధాన్యం కొంటారో.. కొనరో.. తెలియక ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి.. కానీ, మీ గుండెలు కరగటం లేదు..’ అని సీఎం కేసీఆర్‌పై ఆమె మండిపడ్డారు. ‘ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతు కష్టాలు కానొస్తలేవు..’ అని సీఎంనుద్దేశించి షర్మిల విమర్శించారు. ‘కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే.. మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా డిమాండ్..’ అని వైఎస్సార్‌టీపీ చీఫ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios