Asianet News TeluguAsianet News Telugu

షర్మిల బాటలోనే... పోలీసులపై చేయిచేసుకున్న వైఎస్ విజయమ్మ (వీడియో)

వైఎస్ షర్మిల మాదిరిగానే వైఎస్ విజయమ్మ కూాడా తనను అడ్డుకుంటున్న పోలీసులపై చేయి చేసుకున్నారు. 

  YS Vijayamma Slapped women police in front of police station at Hyderabad AKP
Author
First Published Apr 24, 2023, 1:46 PM IST

హైదరాబాద్ :వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్టుతో  హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో పాటు ఎస్సైని తోసేసిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసారు. కూతురిని అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన వైఎస్ విజయమ్మ వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసుపై విజయమ్మ కూడా చేయిచేసుకున్నారు. 

 వీడియో

కూతురిని అరెస్ట్ చేసినట్లు తెలిసిన వెంటనే విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ లోకి వెళ్లనివ్వకుండా కారు దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోసుకుని ముందుకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. అయినా సాధ్యపడకపోవడంతో సహనం కోల్పోయిన విజయమ్మ ఎదురుగా వున్న ఓ మహిళా పోలీస్ చెంపపై కొట్టారు. 

అంతకుముందు వైఎస్ షర్మిల టిఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీపై విచారణ చేపట్టిన సిట్ కార్యాలయానికి వెళతారన్న అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. కానీ ఆమె ఆగకుండా ముందుకు కదులుతుండటంతో ఓ మహిళా కానిస్టేబుల్ పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన షర్మిల ఎస్సైని తోసెసి కానిస్టేబుల్ చెంపపై కొట్టారు.

Read More వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు విజయమ్మ.. పోలీసులపై ఆగ్రహం.. 

షర్మిలను ఆమె ఇంటివద్ద అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్యూటీలో వున్న పోలీస్ పై దాడిచేసిన షర్మిలపై 353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కూతురు లాగే తల్లి షర్మిల కూడా పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆమెపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. 

లోటస్ పాండ్ వద్ద జరిగిన పరిణామాలు, షర్మిల అరెస్ట్, అనంతరం విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు హద్దులు దాటి దురుసుగా ప్రవర్తించడం వల్లే సహనం కోల్పోయిన షర్మిల, విజయమ్మ ఆత్మరక్షణలో భాగంగానే దాడికి దిగారని చెబుతున్నారు. 
 


 

.

 

Follow Us:
Download App:
  • android
  • ios