వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు తెలసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు తెలసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొనసాగుతుంది. అయితే నేడు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల లక్ష్మీనారాయణపురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుల కోరిక మేరకు నీరా రుచి చూశారు. అయితే తొలుత తనకు అలవాటు లేదని చెప్పిన షర్మిల.. గీత కార్మికుల విజ్ఞప్తితో నీరా రుచి చూశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఇక, వైఎస్ షర్మిల నీరా రుచి చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Scroll to load tweet…
