తెలంగాణ‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్న‌దాత‌లు రోడ్డెక్కుతున్నార‌ని ఆమె మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్రధానంగా ప్ర‌స్తావించిన షర్మిల‌.. తెలంగాణ‌లోని ప్ర‌తి రంగంలోనూ ప్ర‌జ‌లు రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెల‌పాల్సి వ‌స్తోంద‌ని ఎద్దేవా చేశారు.

Also Read:పేదలు పిట్టల్లా రాలుతున్నారు.. మీది గుండెనా, బండనా: కేసీఆర్‌పై షర్మిల విమర్శలు

'విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా మీకు రైతు గోస కనపడదు.. వినపడదు..' అని వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు