Asianet News TeluguAsianet News Telugu

పేదలు పిట్టల్లా రాలుతున్నారు.. మీది గుండెనా, బండనా: కేసీఆర్‌పై షర్మిల విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్ మీది గుండెనా..బండనా.? అని ఆమె ప్రశ్నించారు. సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. 658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దని... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందేనని షర్మిల కోరారు. 

ys sharmila demands cm kcr to list corona treatment in aarogya sri ksp
Author
Hyderabad, First Published May 26, 2021, 4:04 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్ మీది గుండెనా..బండనా.? అని ఆమె ప్రశ్నించారు. సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. 658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దని... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందేనని షర్మిల కోరారు. పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా..? అని ఆమె ధ్వజమెత్తారు. ఆయుష్మాన్ భారత్‌లో తెల్లరేషన్ కార్డున్నవారంతా రారని ఆమె గుర్తుచేశారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

కొద్దిరోజుల క్రితం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చికిత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు తాము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారని ఆమె ఆరోపించారు. 

Also Read:ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్

ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని షర్మిల వెల్లడించారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్ లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని వ్యాధులకు 5 లక్షల రూపాయల వరకే పరిమితి ఉందని, అదే ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలకు 13 లక్షల రూపాయల వరకు పరిమితి ఉందని షర్మిల గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios