Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వాటాఒక్క చుక్క నీటిని కూడ వదులుకోం: వైఎస్ షర్మిల

 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ఆర్డీఎస్ కుడికాలువ వివాదంపై కూడ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ విషయమై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
 

YS Sharmila reacts on irrigation projects lns
Author
Guntur, First Published Jun 28, 2021, 7:26 PM IST


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ఆర్డీఎస్ కుడికాలువ వివాదంపై కూడ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ విషయమై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడ వదులుకోబోమని ఆమె తేల్చి చెప్పారు.ఈ విషయమై ఎవరితోనైనా పోరాడేందుకైనా సిద్దమేనని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. జూలై మాసంలో షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయనుంది. పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటికే ఆమె అన్ని సిద్దం చేసుకొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆమె పర్యటించారు కూడ. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు.

also read:కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కి కేసీఆర్ ఫోన్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , ఆర్డీఎస్ కుడికాలువపై ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ రెండు ప్రాజెక్టుల విషయమై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రానికి కూడ ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తే జైలుకు పంపుతామని సీఎస్ ను ఎన్జీటీ హెచ్చరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios