కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కి కేసీఆర్ ఫోన్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , ఆర్డీఎస్ కుడికాలువపై ఫిర్యాదు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషఁన్ ప్రాజెక్టుతో పాటు,ఆర్డీఎస్ కుడికాలువ పనులపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి షెకావత్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు.
హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషఁన్ ప్రాజెక్టుతో పాటు,ఆర్డీఎస్ కుడికాలువ పనులపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి షెకావత్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం కేసీఆర్
also read:ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుండి అలవాటే: మంత్రి జగదీష్ రెడ్డి
రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కెఆర్‌ఎంబీని ఆదేశించింది కేంద్రం.అవసరమైతే కేంద్ర బలగాల సహాయంతో ప్రాజెకటు పనులు పరిశీలించాలని కేఆర్ఎంబీకి కేంద్రం సూచించింది.నీటి పంపకాల విషయంలో ఎవరికీ కూడ అన్యాయం జరగకుండా చూస్తామని కేంద్ర మంత్రి షెకావత్ హామీ ఇచ్చారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏపీ తీరుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా కూడ ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని తెలంగాణ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.