హైదరాబాద్: మెదక్ ను సీఎం జిల్లాగా చెప్పుకొంటారు ఇక్కడ రైతుల పరిస్థితి ఏమిటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని  వైఎస్ఆర్ అభిమానులతో వైఎస్ షర్మిల బుధవారం నాడు లోటస్‌పాండ్ లో సమావేశమయ్యారు.మాట ఇస్తే అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసే పాలన రావాలని ఆమె చెప్పారు. 

పటాన్ చెరు కాలుష్యాన్ని కంట్రోల్ చేయరా అని ఆమె ప్రశ్నించారు.  తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని ఆమె కోరుకొన్నారు. దీని కోసం తాను  తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం షర్మిల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఈ సమావేశాల్లో భాగంగానే  ఇవాళ ఆమె ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

 వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభను షర్మిల నిర్వహించనున్నారు.ఈ సభలో  పార్టీ విధానాలను ఆమె ప్రకటించనున్నారు. అదే సభలో పార్టీ పేరును కూడ ప్రకటిస్తారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు, అధికారులు షర్మిలతో ఇటీవల కాలంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.