తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తొలుత ఖమ్మం జిల్లా పర్యటనను ఖరారు చేసుకున్నారు షర్మిల

తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తొలుత ఖమ్మం జిల్లా పర్యటనను ఖరారు చేసుకున్నారు షర్మిల.

అయితే ఆమె ఖమ్మం పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిసిన తర్వాతే ఖమ్మంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. 

అంతకుముందు ఈ నెల 21న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారని రాఘవరెడ్డి తెలిపారు.

Also Read:తెలంగాణలో స్పీడ్ పెంచిన షర్మిల...!

‘హైదరాబాద్‌ నుంచి హయత్‌నగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, పాలేరు మీదుగా ఆమె ఖమ్మంలోకి ప్రవేశిస్తారు. అందుకు సంబంధించి దారి పొడుగునా భారీగా స్వాగత ఏర్పాట్లు ఉంటాయి.

ఖమ్మం చేరుకున్నాక మొదట ఆమె వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఏ జిల్లాకు వెళ్లినా 2004 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి, తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులపై షర్మిల సమీక్ష చేస్తారు. వైఎస్సార్‌ అంటేనే అభివృద్ధి, సంక్షేమం..’అని ఆయన పేర్కొన్నారు.