Asianet News TeluguAsianet News Telugu

YS Sharmila : కేసీఆర్ గారు.. ఆ విష‌యంలో సిగ్గుపడాలి: వైయ‌స్ ష‌ర్మిల‌

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ పై  వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వై య‌స్ ష‌ర్మిల మ‌రోసారి విరుచుక‌ప‌డింది. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య‌ల విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించింది. తెలంగాణ వస్తే.. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని కేసీఆర్,, ఏడేళ్లు అయినా నోటిఫికేష‌న్లు వేయ‌డం లేద‌నీ, పీజీలు, డిగ్రీలు చేసి.. హ‌మాలీ ప‌ని వెళ్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
 

YS Sharmila Fires On CM KCR
Author
Hyderabad, First Published Jan 25, 2022, 1:47 PM IST

YS Sharmila:  తెలంగాణ సీఎం కేసీఆర్ పై  వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వై య‌స్ ష‌ర్మిల మ‌రోసారి విరుచుక‌ప‌డింది. 
తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య‌ల విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించింది.
తెలంగాణ వస్తే.. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని కేసీఆర్,, ఏడేళ్లు అయినా నోటిఫికేష‌న్లు వేయ‌డం లేద‌నీ, పీజీలు, డిగ్రీలు చేసి.. హ‌మాలీ ప‌ని వెళ్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

నేడు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్విట్ చేస్తూ.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్ల‌ను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని చెప్పారు.
 
అంత‌కు ముందు.. చదువులపై సోయి లేని దొర.. పాఠశాలల్లో 45 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీ 528 ఎంఈవో పోస్టులకు 520 ఖాళీ, డీఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులూ అరకొరే..ఉద్యోగాలు భర్తీ చేయకుండా హడావిడిగా బదిలీలు ఖాళీలు భర్తీ చేయడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అని ట్విట్ చేసింది.

మరోవైపు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల‌ల‌కు శుభాకాంక్షాలు తెలిపారు. ఆమె స్పందిస్తూ... ఓటుతోనే మార్పు సాధ్యమని చెప్పారు. మెరుగైన స‌మాజ నిర్మాణానికి ఓటే వ‌జ్రాయుధమని అన్నారు. అవినీతి, అక్ర‌మాలు అంతం కావాల‌న్నా.. నియంత‌, నిరంకుశ పాల‌న పోవాలన్నా ఓటు హ‌క్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉప‌యోగించుకోవాలని చెప్పారు. అందరం నిస్వార్థంగా ఓటు వేద్దామని... మన బతుకులు మార్చుకుందామని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios