ఇంకో ట్వీట్ చేస్తూ 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను.

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ప్రజా ప్రతినిధుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సైతం కేటీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు.. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు షర్మిల. అనంతరం ఇంకో ట్వీట్ చేస్తూ 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను.. మీ బాధ్యతను గుర్తుచేసే చిన్న వీడియో కానుక ఇదిగోండి’ అంటూ బీబీసీకి చెందిన వీడియో లింక్ ను షేర్ చేశారు షర్మిల.

వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన న్యూస్ వీడియో అది. తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే చనిపోతున్నట్టు.. తన ఆవేదనని అంతా వీడియో తీసింది. దానిపై బీబీసీ ఓ రిపోర్ట్ చేసింది. ఆ వీడియో లింక్ ను షేర్ చేస్తూ కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు షర్మిల.

Scroll to load tweet…