Asianet News TeluguAsianet News Telugu

కవితకు మంత్రి పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్ ప్లాన్.. షర్మిల ట్వీట్ విమర్శలు..!

గత కొంతకాలంగా.. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరోసారి.. ఆమె ట్విట్టర్ వేదికగా  మండిపడ్డారు.  కవితను మంత్రి ని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.
 

YS Sharmila Allegations on CM KCR
Author
Hyderabad, First Published Nov 27, 2021, 12:03 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై.. వైఎస్ షర్మిల విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఆమె ట్విట్టర్ వేదికగా.. గత కొంతకాలంగా.. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరోసారి.. ఆమె ట్విట్టర్ వేదికగా  మండిపడ్డారు.  కవితను మంత్రి ని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.

Also Read: Bandi Sanjay: కేసీఆర్ రాజకీయ పతనం మొదలైంది.. సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారు.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..

‘బిడ్డ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది.బిడ్డకు రెండుసార్లు MLC, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నాడు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగులమందు తాగుడు, ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుతలేదు. ’ అంటూ ఆమె మండిపడ్డారు.

 

‘ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా?’ అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Also Read: తలొగ్గని కేంద్రం .. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణకు మొండిచేయి, యాసంగిలో వరి వద్దని కుండబద్ధలు

ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె 'తిరగబడ్డడు రైతన్న' అంటూ తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా పెద్ద‌మంద‌డిలో వ‌డ్ల‌కు నిప్పు పెట్టిన రైతుల ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. 'వడ్లు కొన‌కుండా రైతు మీద సర్కారు పగపడుతుంటే, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటుంటే, కొంటారో కొనరో తెలియక రైతు గుండెలు ఆగిపోతుంటే, ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేస్తే, కేసీఆర్ ధాన్యం కొనక రాజకీయాలు చేస్తుంటే.. తిరగబడ్డడు రైతన్న' అని ష‌ర్మిల పేర్కొన్నారు.

'ఆగ్రహించిన రైతన్న చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెట్టుకొంటుండు! ఆత్మహత్య చేసుకుంటుండు! దొరా.. నువ్వు పంట కొననని చెప్పినా, రైతులతో కాళ్లు మొక్కించుకున్నా, పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా, నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా' అని ష‌ర్మిల హెచ్చ‌రించారు.

Follow Us:
Download App:
  • android
  • ios