Asianet News TeluguAsianet News Telugu

నకిలీ వీడియోలు, తప్పుడు ఆరోపణలు.. శాక్రిఫైజ్ స్టార్, యూట్యూబర్ సునిశిత్‌ అరెస్ట్ !

రాత్రికి రాత్రే స్టార్ అయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు సునిశిత్. ప్రముఖులపై వ్యాఖ్యానిస్తే ఉచితంగా ప్రచారం పొందొచ్చని భావించి  పలువురు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 

youtuber sunishith arrested in hyderabad
Author
Hyderabad, First Published Oct 2, 2021, 11:14 AM IST

కీసర : నకిలీ వీడియోలను (Fake videos) సృష్టించి ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసిన యూట్యూబర్ (youtuber)పై శుక్రవారం కీసర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  జనగాం జిల్లాకు చెందిన ఆర్. సునిశిత్ ( 32) (sunishith) ఎంటెక్ చదివాడు.  చదువు పూర్తయిన తరువాత ఓ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్ళాడు.

జైలు నుంచి విడుదలైన తర్వాత 2014లో  నివాసాన్ని రాంపల్లి  ఆర్ఎల్ నగర్ కి మార్చాడు.  ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు.  రాత్రికి రాత్రే స్టార్ అయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు సునిశిత్. ప్రముఖులపై వ్యాఖ్యానిస్తే ఉచితంగా ప్రచారం పొందొచ్చని భావించి  పలువురు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 

తెలుగు అకాడమీ స్కామ్: కోట్లు కొట్టేసి ఇన్నోవా కారులో నగదు తరలింపు, రూ. 6 కోట్లు కమిషన్

ఈ విషయంలో గత ఏడాది అతనిపై కేసు నమోదయ్యింది. రిమాండ్ కు కూడా వెళ్ళాడు. తరువాత సునిశిత్ టీవీ పేరుతో  ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు.  వివాదాస్పద వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు.  ఇటీవల మల్కాజిగిరి స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఆ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని కీసర సిఐ నరేందర్ గౌడ్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios