మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: వీడియోను తొలగించిన యూట్యూబ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను యూట్యూబ్ తొలగించింది. హైద్రాబాద్ పోలీసుల వినతి మేరకు యూట్యూబ్ ఈ వీడియోను  తొలగించింది. 

Youtube Removes BJP MLA Raja Singh Controversial Video

హైద్రాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ తొలగించింది. హైద్రాబాద్ పోలీసుల వినతి మేరకు  యూట్యూబ్ ఈ  వీడియోను తొలగించింది. 
మహ్మద్ ప్రవక్తపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి.ఈ విషయమై హైద్రాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు చేశారు. హైద్రాబాద్ డబీర్ పురా పోలీసుులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.  .ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఐఎం  హైద్రాబాద్ లో సోమవారం నాడు రాత్రి ఆందోళనకు దిగింది.  రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో వివాదాస్పదం కావడంతో యూట్యూబ్ ఈ వీడియోను తొలగించిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

also read:మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: హైద్రాబాద్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు

మునావర్ ఫరూఖీ షో కి కౌంటర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయాలను పంచుకొంటూ యూట్యూబ్ లో వీడియోలను అప్ లోడ్ చేశారు. అయితే ఈ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు కోరుతూ హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు సోమవారం నాడు రాత్రి ఎంఐఎం ఆందోళనకు దిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ పై చర్యలు తీసుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కూడా ఎంఐఎం నేతలు తేల్చి చెప్పారు.మరో వైపు డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదైంది.  ఇతర పోలీస్ స్టేషన్లలో  కూడా రాజాసింగ్ పై కూడా ఫిర్యాదులు అందాయని ఆ చానెల్ కథనం తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios