Asianet News TeluguAsianet News Telugu

పోలీసులపైనే దాడికి కారణమంటూ... ప్రముఖ యూట్యూబ్ యాంకర్ రఘు అరెస్ట్

ఇటీవల గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించమే వ్యవహరించమే కాదు పోలీసులపై దాడులకు కారణమయ్యాడంటూ ప్రముఖ యాంకర్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. 

youtube anchor raghu arrest in hyderabad akp
Author
Hyderabad, First Published Jun 3, 2021, 4:36 PM IST

సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్ యాంకర్ రఘును హుజూర్ నగర్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించమే వ్యవహరించమే కాదు పోలీసులపై దాడులకు కారణమయ్యాడని రఘుపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదయ్యాయి. 

ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ మల్కాజిగిరిలోని నివాసంలో రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడినుండి అతన్ని హుజూర్ నగర్ కు తరలించిన పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పర్చారు. అతడికి జడ్జి 14రోజులు రిమాండ్ విధించగా పోలీసులు హుజూర్ నగర్ జైలుకు తరలించారు.

read more  గుర్రంపోడు మళ్లీ పోతాం.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం.. కేసీఆర్ కి బండి సంజయ్ సవాల్

మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్నాడు జర్నలిస్ట్ రఘు. అసలు ఈ గుర్రంపోడు వివాదం ఏంటంటే...  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ రేకుల షెడ్డును ధ్వంసం చేయడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగాయి. వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలోని రాళ్లదాడిలో సీఐకి గాయాలయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios