గుర్రంపోడు తండాకు మళ్లీ వెల్తామని... ఈ సారి పెరేడ్ కూడా నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో.. అక్కడికే వచ్చి తేల్చుకోవాలని సవాల్ చేశారు.

ముఖ్యమంత్రో వస్తాడో, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు వస్తాడో రావాలని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోమని మండిపడ్డారు బండిసంజయ్. అంతేకాదు నాగార్జున సాగర్ లో ఈ నెలలోనే బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. బరిలో నిలిపే అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.

రెండు ఎమ్మెల్సీలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలందరం ప్రచారం చేస్తామని తెలిపారు. 25మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ ని పెట్టామన్నారు. 

మేధావులు టీఆర్ఎస్ కి బుద్ది చెప్పాలని.. లేకుంటే తెలంగాణ అయ్యాయమైపోతుందని పిలుపునిచ్చారు. 

ఈ నెల 7 వ తేదిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో జరిగిన బీజేపీ గిరిజన భరోసా యాత్ర రసాభసాగా మారిన సంగతి తెలిసిందే. యాత్ర లో భాగంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవల్లో కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో 21మంది బీజేపీ నాయకులపై కేసు నమోదైంది. IPC సెక్షన్ 143, 144, 147, 148, 332, 333 r/w 149 క్రింద మరిము క్రిమినల్ లా అమెండమెంట్ యాక్ట్ 1932 సెక్షన్ 7(1)(a) కేసులు పోలీసులు నమోదు చేశారు.