కరోనా వైరస్.... ఈ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఆ వైరస్ బారిన పడ్డాయి. ఆ వైరస్ సోకని దేశం దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి ఇప్పుడు భారత దేశంపై కూడా పంజా విసురుతోంది. 

భారత దేశంపై ఈ వైరస్ దండెత్తుతున్న వేళ భారతదేశమంతా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కంకణం కట్టుకుంది. దేశమంతా దాదాపుగా లాక్ డౌన్ లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కొనసాగడంతోపాటుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. 

మన తెలుగు రాష్ట్రాల్లో  కర్ఫ్యూ కొనసాగుతుండగా... కేంద్రం తాజాగా రాష్ట్రాలకు కావాలనుకుంటే... ఎప్పుడంటే అప్పుడు ఏ నగరంలో అంటే ఆ నగరంలో కర్ఫ్యూ విధించుకోవొచ్చని తెలిపింది. ఇక లాక్ డౌన్ కానీ, కర్ఫ్యూ కానీ ప్రజలెవరైనా బయట తిరగొద్దనేది ప్రభుత్వ ఆదేశం. 

జనాలు గుమికూడకుండా అందరిని ఇండ్లకే పరిమితం చేస్తే... ఈ మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ప్రపంచంలో ఈ మహమ్మారి నుండి బయటపడ్డ దేశాలన్నీ కూడా ఇదే విధంగా పాటించాయి. 

ఇక ఇలా ప్రజలను ఇండ్లలోనే ఉండమని చెప్పినప్పటికీ... చాలా మంది పోలీసులకు ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ... కొందరు మాత్రం ఆంక్షలను ఉల్లంఘిస్తూ బయటకు వస్తున్నారు. 

సరైన కారణం లేకుండా లాక్ డౌన్ పీరియడ్ లో బయటకు వచ్చినప్పుడు పోలీసులు కూడా తమదైన శైలిలో వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తొలుత దండాలు పెట్టిన పోలీసులు ఇప్పుడు డండాలు అందుకొని బడిత పూజ చేస్తున్నారు. 

పోలీసులు కొడుతున్నారని చాలా మంది ప్రజలు ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. కొందరైతే... ఎవర్ని పడితే వారిని కొట్టిన కర్రలతో కొడితే కరోనా రాధ అని ప్రాశ్నిస్తున్నారు కూడా. అయితే తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. 

పోలీసులు బయటకెళ్ళి ముందు లాఠీలకు సైతం శానిటైజర్ పోస్తున్నారు. ఇలా శానిటైజ్ చేసిన లాఠీలనే వాడుతున్నారన్నమాట పోలీసులు. కొట్టేటప్పుడు కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుమా!