హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్ వద్ద శుక్రవారం బీజేపీకి వ్యతిరేకంగా కొందరు యువకులు నినాదాలు చేయడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు మక్కా మసీదు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు

హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కొందరు యువకులు నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ప్రార్థనల తర్వాత బయటకు వచ్చిన యువకులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మక్కా మసీదు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.