యువత పెడదోవ పడుతోంది. చిన్న చిన్న కారణాలకు చిన్నా, పెద్దా తేడా లేకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. చేతిలో టెక్నాలజీతో బ్లాక్ మెయిలింగ్, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. 

ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారు టీనేజ్ వారే కావడం కాస్త ఆందోళన కలిగించే విషయం.. అలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నెంబర్ ను షేర్ చాట్ లో.. పెట్టి కాల్ గర్ల్ గా చిత్రీకరించాడో వ్యక్తి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఆకుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్ల యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రెండు వేలు అప్పు తీసుకున్నాడు. 

కానీ ఎన్ని రోజులైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. సదరు మహిళ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అతడిని మందలించారు. ఈ విషయమై బాధితురాలిపై, ఆమె భర్త పై యశ్వంత్ పగ పెంచుకున్నాడు.

సహజీవనం : యువతిని అర్థరాత్రి తీవ్రంగా కొట్టి, కిడ్నాప్ యత్నం.......

వారి పరువు తీయాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్ నెంబర్ ను షేర్ చాట్ లో పెట్టాడు. దీంతో నిత్యం బాధితురాలికి ఫోన్లు రావడం, వేధింపులకు పాల్పడుతుండడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.