హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. నదీమ్ ఖాన్ అనే యువకుడు అపహరణకు గురయ్యాడు. నదీమ్ కు ఓ యువతితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. 

అది నచ్చక నదీమ్ నిశ్చితార్థం చేసుకున్న యువతిని వధువు ప్రియుడు కిడ్నాప్ చేశాడు. బైక్ మీద వెళ్తుండగా ఆపి నదీమ్ ఖాన్ ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వివరాలు తెలియాల్సి ఉంది.