సిద్ధిపేటలో దారుణం చోటుచేసుకుంది. దళిత బాలికకు మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకొని వెళ్లి... 12గంటల పాటు నిరంతరాయంగా అత్యాచారం చేశారు. నొప్పి తట్టుకోలేక బాలిక అరుస్తుంటే... బెల్టుతో వాతలు పడేలా కొడుతూ రాక్షసానందం పొందారు.  వాళ్ల ఆకలి తీరిన తర్వాత.. బాలికను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో గతంలో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని బాలికకు మాయమాటలు చెప్పాడు. అనంతరం బైక్ పై ఎక్కించుకొని రాయవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్ సమీపంలోని రాజీవ్ రహదారి పరిసర ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అనంతరం తన స్నేహితులు మరో ఇద్దరికి ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. ఆ ప్రాంతంలో బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 12 గంటలపాటు నిరంతరాయంగా బాలికకు నరకం చూపించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను వారి అవసరం తీరాక రోడ్డుపై వదిలేసి పరారయ్యారు.

గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు జరిగింది ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.