Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో దారుణం ... ప్రియురాలిని కారులో బంధించి రోడ్డుపైనే అఘాయిత్యం

చిన్ననాటి స్నేహితురాలు... ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలితో సైకోలా వ్యవహరించి హత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ దారుణం హైదరాబాద్ కుషాయిగూడలో చోటుచేసుకుంది. 

Youngster murder attempt on his Girl friend at Hyderabad AKP
Author
First Published Nov 5, 2023, 12:02 PM IST

హైదరాబాద్ : వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు... ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలు తీసేందుకు సదరు ప్రియుడు ప్రయత్నించాడు. కారులో బంధించి ప్రియురాలిపై కత్తితో దాడిచేసి ఆ తర్వాత తానుకూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ(21), మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్. ఒకే స్కూల్లో చదువున్న సమయంలో చిగురించిన స్నేహం టీనేజ్ కు వచ్చేసరికి ప్రేమగా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.

చాలాకాలంగా వీరిమధ్య ప్రేమ వ్యవహారం సాగుతుండగా హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు యువతి మనసు మార్చుకుంది. ఇకపై తనకు దూరంగా వుండాలని... ఇక్కడితో ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవాలని ప్రియుడికి చెప్పింది. ఒక్కసారిగా ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో సైకోలా మారిన అతడు ప్రియురాలిని చంపి తానుకూడా సూసైడ్ చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

Read More  కూతురి ముందే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య

నిన్న (శనివారం) తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఓసారి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు వంశీ. ఇద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో వెళ్లారు. ఓ చోట కారు ఆపిన వంశీ వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె కడుపు, మెడ భాగంలో గాయాలవడంతో ప్రాణభయంతో కేకలు వేసింది. దీంతో కారుచుట్టు జనాలు గుమిగూడటంతో వంశీ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరి రక్తంతో కారంతా రక్తసిక్తం అయ్యింది. 

కారుచుట్టు చేరినవారు వెంటనే విండో అద్దాలు పగులగొట్టి డోర్ తెరిచారు. వెంటే ఇద్దరిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వెంటనే వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios