హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి దారుణం చోటుచేసుకుంది. అర్దరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి దారుణం చోటుచేసుకుంది. అర్దరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. బాధితుడు అర్దరాత్రి సమయంలో వాష్ రూమ్ కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా అమన్‌గల్‌కు చెందిన పవణ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడి ఇ ఒమర్‌లో నివాసం ఉంటున్నాడు. అర్దరాత్రి 12.30 గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కోసం తన ఇంటి నుండి బయటకు రాగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు. పవన్‌ను హత్య చేసిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
పవణ్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకి వచ్చి చూసేలోపు అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పవణ్ మృతి చెందాడు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించింది. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇక, ఈ ఘటనతో పవణ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
