Asianet News TeluguAsianet News Telugu

తిని కూర్చుంటే, అరగడం లేదు.. అందుకే రోడ్డు మీదికి : లాక్ డౌన్ ఉల్లంఘన

లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీద యదేచ్ఛగా తిరుగుతూ.. నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి తెలిసిందే. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపించాయి. పాలకూర కోసమని, గోధుమ పిండి కొనడానికని, వడియాలు పెట్టడానికని... ఇలా రకరకాల పేర్లతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారు కనిపించారు. 

youngstar breaks lockdown rule and says a silly reason in hyderabad - bsb
Author
Hyderabad, First Published May 25, 2021, 11:14 AM IST

లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీద యదేచ్ఛగా తిరుగుతూ.. నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి తెలిసిందే. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపించాయి. పాలకూర కోసమని, గోధుమ పిండి కొనడానికని, వడియాలు పెట్టడానికని... ఇలా రకరకాల పేర్లతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారు కనిపించారు. 

తాజాగా సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కాస్త తక్కువగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే తాజాగా ఓ వ్యక్తి తిన్నది అరగడం లేదు అందుకే.. బైటికి వచ్చా అని చెప్పి పోలీసులను షాక్ చేశాడు.

వివరాల్లోకి వెడితే.. ‘సార్.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో తిన్నది అరగడం లేదు.. మా ఇంట్లో వాళ్లందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ఈనో ప్యాకెట్లు కొనేందుకు బయటకు వచ్చా.. ’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద సోమవారం జరిగింది. 

లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ మీద వచ్చాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో మందుల కోసం అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఏం మందులు తీసుకున్నావో చూపించమని పోలీసులు అడిగారు.

దీంతో ఆ యువకుడు బ్యాగులో నుంచి 50 ఈనో ప్యాకెట్లు తీసి చూపించాడు. ఎందుకు ఇన్ని తీసుకున్నావ్ అని అనుమానంగా ప్రశ్నించగా... లాక్ డౌన్ వల్ల తను, తన తండ్రి, సోదరుడు, భార్య ఇంట్లోనే ఉంటున్నామని, పనేం లేక తిని కూర్చోవడం వల్ల తిన్నది అరగడం లేదని.. అందుకే ఈనో ప్యాకెట్లు తీసుకుని వెల్తున్నానంటూ సమాధానం చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios