Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య... కూకట్ పల్లిలో విషాదం..

వివాహం కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో విషాదం నెలకొంది. 

Young woman commits suicide for not getting married in hyderabad
Author
Hyderabad, First Published May 20, 2022, 9:37 AM IST

హైదరాబాద్ : చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెందడం. suicideలకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి  ఓ విషాద సంఘటన నగరంలోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. వయసు మీరుతున్నా marriage కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మీ (26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. 

ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చాలామంది వచ్చి చూసి పోతున్నారే కానీ.. సంబంధం కుదరడం లేదు. తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా… వివాహం మాత్రం కావడంలేదని ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి  గురువారం  మృతి చెందింది. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఇలాంటి విషాద సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. Hyderabadలో దారుణం జరిగింది. నగరంలోని కుల్సుంపురలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 12 యేళ్ల బాబు మృతదేహాన్ని stray dogs పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం dead bodyని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాబును ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మృతదేహం లభ్యమైన ప్రదేశానికి కాస్త దూరంలో మూసీనది పారుతూ ఉండడంతో కుక్కలు మృతదేహాన్ని అక్కడినుంచి లాక్కొచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. సోఫియన్ తండ్రి సయ్యద్ కార్వాన్ లో సబ్జీమండీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. అక్కడినుంచి బాలుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఇది చాలా నిర్మానుష్యప్రాంతం. 20 రోజుల కిందట కూడా ఇక్కడ ఓ హత్య జరిగింది. కొద్ది రోజుల కిందట లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటనలు జరగడానికి నిర్మానుష్య ప్రాంతాలు కావడం, మందుబాబులు రాత్రుళ్లు సంచరిస్తూ ఉండడం.. చెత్తా చెదారం నిండి ఉండడం కారణాలుగా కనిపిస్తున్నాయి. 

సోఫియన్ తండ్రి సయ్యద్ ను పోలీసులు విచారిస్తున్నారు. సోఫియన్ తలకు గాయం అయ్యింది. అయితే అది తలపై కొట్టి చంపడం వల్ల అయ్యిందా.. చంపి మూసీలో పడేసిన సమయంలో అయ్యిందా.. వీధికుక్కలు పీక్కుతినే సమయంలో అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కార్వాన్ నుంచి జియాగూడా వరకు.. సబ్జిమండీ నుంచి కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios