తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు యువకుడు.  

జగిత్యాల: ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్ చేశాడు. తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు యువకుడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల కు చెందిన వెంకటరమణ అనే యువకుడు కరీంనగర్ కు చెందిన యువతిని ప్రేమించాడు. అయితే యువతి మాత్రం అతడి ప్రేమను అంగీకరించలేదు. అయినప్పటికి అతడు ప్రేమ పేరిట వేధిస్తుండటంతో యువతి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వీడియో

పోలీసులు విచారణ నిమిత్తం వెంకటరమణను స్టేషన్ కు పిలిపించగా భయాందోళనకు గురయ్యాడు. దీంతో తనవెంట పెట్రోల్ తెచ్చుకుని పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించారు. 

దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని... తాను ప్రేమించిన అమ్మాయిని రప్పించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా మీడియా సమక్షంలో స్టేషన్‌ లోపలికి వస్తానని షరతు విధించాడు. చివరికి వెంకటరమణను ఎలాగోలా సముదాయించి స్టేషన్‌లోకి తీసుకెళ్ళిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి వెంట పడవద్దని గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టారు.