Asianet News TeluguAsianet News Telugu

ఎస్సై వేధిస్తున్నాడు... నా ఆత్మహత్యకు కారణమదే: సిరిసిల్ల యువకుడి వీడియో వైరల్

ఎస్సై వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నానంటూ చివరి క్షణాల్లో ఓ యువకుడు ఆవేదనను వెల్లగక్కుతూ తీసుకున్న వీడియో సిరిసిల్ల జిల్లాలో  వైరల్ గా మారింది. 

young boy suicide atsiricilla district... video viral akp
Author
Illanthakunta, First Published Aug 1, 2021, 2:02 PM IST

సిరిసిల్ల: తన వద్ద లంచం తీసుకుని కూడా ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్ని విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సైతో పాటు మరికొందరి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంటలో మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన రెబ్బల వంశీ ఇటీవల పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లంతకుంట ఎస్సై వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ వంశీ చనిపోయాడు. తన ఆవేదనను, ఆత్మహత్యకు గల కారణలను తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వీడియో

తన చావుకి కారణమైన ఇల్లంతకుంట ఎస్సై కారణమని అతడు వెల్లడించాడు. పలు దఫాలు తన వద్ద ఎస్సై రెండు లక్షల రూపాయలు లంచం తీసుకొన్నాడని వంశీ  వెల్లడించాడు. అయినప్పటికి తిరిగి తనపైసే కేసు పెడతానని బెదిరించాడని తెలిపాడు. జీవనోపాధి అయిన ట్రాక్టర్ను కూడా పోలీస్ స్టేషన్ లోనే పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపాడు. ఎలాంటి కేసు పెట్టకుండానే ట్రాక్టర్ ను స్టేషన్లోనే పెట్టుకున్నాడని ఆరోపించాడు. 

తన ఆత్మహత్యకు మరికొందరు కూడా కారణమని వంశీ వీడియోలో పేర్కొన్నాడు. తన చావుకి కారణమైన వారందరిపై కేసు నమోదు చేసి న్యాయాన్ని కాపాడాల్సిందిగా జిల్లా పోలీస్ అధికారులను వంశీ కోరుకుంటున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios