హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వచ్చిన ఓ యువనటిని వేధించాడో యువకుడు. వెంబడిస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బంజారా హిల్స్ : సెలబ్రిటీలు కనబడితే చాలు వారిని ఏదో రకంగా వేధించాలని ప్రయత్నించే ఆకతాయిలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. అలాంటి ఓ ఘటనే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వచ్చిన ఓ యువనటిని.. ఓ అగంతకుడు ఇలాగే వెంబడించి వేదించాడు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే, ఈ నటికి ఇదే పార్కులో గతంలో కూడా ఓచేదు అనుభవం ఉంది.
హ్యాట్సాఫ్ పోలీస్... గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన యువకున్ని కాపాడిన కానిస్టేబుల్
అంతకుముందు ఒకసారి వాకింగ్ కు వచ్చినప్పుడు ఓ దుండగుడు ఆమెను బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో ఉండే కేబీఆర్ పార్కుకు బుధవారం రాత్రి వాకింగ్ కి వచ్చింది. పార్కు లోపల రాత్రి 7 గంటల సమయంలో ఆమె వాకింగ్ చేస్తుంటే ఆమెను ఓ యువకుడు వెంబడించాడు. తనని ఎవరో వెంబడిస్తున్నట్లుగా అనిపించిన ఆమె.. యువకుడిని గమనించి ఒకచోట ఆగిపోయింది. ఆ యువకుడు కూడా అక్కడే నిలబడిపోయాడు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదారు సార్లు జరిగింది. ఆ యువకుడు ఆమెనే వెంబడిస్తున్నాడు. దీంతో ఆమె తనతో పాటు వాకింగ్ చేస్తున్న మిగతా వారికి ఈ విషయం చెప్పి అలర్ట్ చేసింది. వారు వెంటనే పార్కు సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ యువకుడిని గమనించి పట్టుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి పేరు శేఖర్ అని పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
