Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్ పై రఘురామ కృష్ణంరాజు కుటుంబసభ్యులు దాడి.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు..

విధుల్లో ఉన్న ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ మీద ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. చిత్రహింసలకు గురిచేసి.. చివరికి అనుమానితుడు అంటూ పోలీసులకు అప్పగించారు. 

ycp rebel MP raghu rama krishnam raju family members attacked on constable
Author
hyderabad, First Published Jul 5, 2022, 10:47 AM IST

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాదులో ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాష విధి నిర్వహణలో ఉన్నాడు. అతని మీద ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి  తెగబడ్డారు. సోమవారం ఉదయం  విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఆ తర్వాత కిడ్నాప్ చేశారు. కొందరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లతో వచ్చి.. నడి రోడ్డుమీదే  కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కున్నారు.. ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి  తీసుకువెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ను రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురి చేశారు.  

ఆ తర్వాత అనుమానిత వ్యక్తి అంటూ గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లోనే ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.తన మీద దాడికి పాల్పడింది రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, కొందరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్ళేనని.. వారి మీద  అ కానిస్టేబుల్ ఫరూక్ భాషా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..  ప్రధాని నరేంద్రమోడీ ఏపీ, తెలంగాణ పర్యటన సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ప్రధానికి నిరసన తెలిపేందుకు  ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని సంఘాలు వచ్చినట్లు సమాచారం అందింది.

భీమవరం, విజయవాడలలో కూడా ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటిలిజెన్స్ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాదులో స్పాటర్స్ గా  నియమించింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఇది అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు అనుసరించే మామూలు విధానమే. ఆ విధంగా ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ భాషాను హైదరాబాదులోని ఐఎస్ బీ గేటు వద్ద స్పాటర్ గా నియమించారు. అలా సోమవారం ఉదయం ఫరూక్ ఐఎస్బీ గేటు వద్ద విధుల్లో ఉన్నారు. 

మచిలీపట్నంలో విషాదం... సముద్రంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు

గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ లో ఉన్న ఎంపీ  రఘురామకృష్ణంరాజు  నివాసానికి ఇది  దాదాపు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఫరూక్ నిర్వర్తించే విధులకు రఘురామా ఇంటితో గాని, ఆ ప్రాంతంతో గాని ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు కొందరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తో కలిసి కారు  లో వచ్చి ఫరూక్ మీద దాడి చేశారు. ఆ కారు నెంబరు 7777. తెలుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్. రావడం రావడమే  కానిస్టేబుల్ ను ఎవరు నువ్వు అని అడుగుతూ దాడికి దిగారు. నడిరోడ్డు మీద పిడిగుద్దులు కురిపించారు. ఇంటిలిజెంట్ కానిస్టేబుల్ను అని  ఐడి కార్డు చూపిస్తున్నా వారు వినిపించుకోలేదు. గుర్తింపు కార్డును లాక్కున్నారు. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా చేతులు వెనక్కి కట్టి, దాడి చేస్తూ ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి తీసుకు వెళ్లారు. ఆ దృశ్యాలను కొందరు పాదచారులు సెల్ ఫోన్ లో వీడియో కూడా తీశారు. 

అతడిని తీసుకు వెళ్లిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు, సిబ్బందితో పాటు కొందరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా చిత్రహింసలకు గురిచేశారు. ఫైబర్ లాఠీలతో కాళ్ళు, చేతులు, కడుపు పై కొట్టారు. గొంతు పట్టుకుని గాయపరిచారు. ఆ తర్వాత గచ్చిబౌలి పోలీసులకు అనుమానితుడు అంటూ అప్పగించారు. అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. కాగా విధినిర్వహణలో ఉన్న తనను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. సిబ్బంది. సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్ ఫరూక్ భాష గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios