మూడున్నరేళ్ల విచారణ అనంతరం ఎట్టకేలకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు శిక్ష ఖరారైంది.  

మూడున్నరేళ్ల విచారణ అనంతరం ఎట్టకేలకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ కు చెందిన ఐదుగురు నిందితులపై నేరం రుజువుకావడంతో ఎన్‌ఏఏ ప్రత్యేక న్యాయస్థానం వారిని దోషులుగా ప్రకటించింది. ఈనెల 19న దోషులకు శిక్షలు ఖరారుకానున్నాయి.

ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లుగా కేసు విచారణ జరిపింది. 157మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.

దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన పేలుళ్లలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. సరూర్‌నగర్‌, మలక్‌పేట పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.

ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా కోర్టు నిర్ధరించింది. అసదుల్లా అక్తర్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌లు ప్రత్యక్షంగా సైకిళ్లపై బాంబులు పెట్టి పేల్చినట్లు ఎన్‌ఏఐ ఆధారాలు సేకరించింది.