Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్‌లో టిక్కెట్ల లొల్లిలో ట్విస్ట్: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా  ఉన్న  ఫోటో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బీఆర్ఎస్ టిక్కెట్ల జాబితాను  విడుదల చేసే సమయంలో ఈ ఫోటో బయటకు రావడం కలకలం రేపుతుంది.

wyra  Former MLA  madanlal Along with  woman  Photos  goes viral on Social media lns
Author
First Published Aug 20, 2023, 10:36 AM IST

ఖమ్మం: వైరా మాజీ ఎమ్మెల్యే  మదన్ లాల్  మహిళతో సన్నిహితంగా  ఉన్న ఫోటో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  ఈ  ఫోటో  మదన్ లాల్  కు రాజకీయంగా ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

వైరా  టిక్కెట్టు తనకే దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉన్నారు.అయితే ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడ  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే  మదన్ లాల్  ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియా రిపోర్టు చేసింది. సోషల్ మీడియాలో కూడ ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఫోటోలు  స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయాన్ని అవకాశంగా తీసుకున్న రాజకీయ ప్రత్యర్థులు మదన్ లాల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారని  ప్రశ్నిస్తున్నారు.అయితే  ఈ ఫోటోలు  నిజమైనవా,  మార్ఫింగ్ ఫోటోలా అనేది తేలాల్సి ఉంది.  మరో వైపు ఈ ఫోటోలను మార్ఫింగ్  చేశారని  మదన్ లాల్ వర్గీయులు చెబుతున్నారు.వైరా టిక్కెట్టు మదన్ లాల్ కు దక్కకుండా చేసేందుకు గాను కుట్ర చేశారని ప్రత్యర్ధులపై  మదన్ లాల్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. టిక్కెట్ల జాబితా విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు  ఈ ఫోటోలు  మీడియాతో పాటు,సోషల్ మీడియాలో వైరల్ గా మారడం  ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios