తెలంగాణలోని సిరిసిల్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా హబ్.. : కేటీఆర్
Hyderabad: ఇంటిగ్రేటెడ్ మంచినీటి ఆక్వా హబ్ ద్వారా ఏటా రూ.1,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతాయని, ప్రత్యక్షంగా 4,800 మందికి, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) తెలిపారు.
Telangana IT minister KT Rama Rao (KTR): రాజన్న సిరిసిల్లలోని మిడ్ మానేరు డ్యాం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మంచినీటి ఆక్వా హబ్ ను తెలంగాణ త్వరలోనే పొందనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ప్రకటించారు. ఈ మంచి నీటి ఆక్వా హబ్ ద్వారా ఏటా రూ.1000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతాయనీ, ప్రత్యక్షంగా 4800 మందికి, పరోక్షంగా 7000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేపల విత్తనోత్పత్తి, దాణా ఉత్పత్తి, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ సహా అన్ని కార్యకలాపాలను కలుపుకొని ఆక్వా హబ్ లో ప్రత్యేక హేచరీలు, దాణా ఉత్పత్తి యూనిట్లు, ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతి ఆధారిత లాజిస్టిక్స్, టెస్టింగ్, ఆర్అండ్ డీ సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు.
కేటీఆర్ ట్వీట్ చేసిన సంబంధిత వీడియోలో.. 300 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ మంచి నీటి ఆక్వాహబ్ ప్రాజెక్టులో రిజర్వాయర్ మొత్తం నీటి ప్రవాహ విస్తీర్ణంలో 1500 ఎకరాల నుంచి ఇప్పటికే 150 ఎకరాల నీటి విస్తీర్ణాన్ని కేటాయించడంతో ఏటా 1.2 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఫిష్ఇన్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, రాజన్న ఆక్వా (నందా గ్రూప్), ముల్పూరి ఆక్వా సంస్థలు రూ.1,300 కోట్లు వెచ్చించి హబ్ లో తమ ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. హేచరీలో సంవత్సరానికి 5750 లక్షల మెట్రిక్ టన్నుల విత్తన ఉత్పత్తి అవుతుందనీ, స్థానిక రైతులను ఆదుకోవడం ద్వారా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్ మరియు పౌల్ట్రీ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల చేపల మేత ఉత్పత్తి చేయబడుతుందని పేర్కొన్నారు.