ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఐ ఎంఎల్ పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి నర్సయ్య ఆరు దఫాలు విజయం సాధించారు. ఆరు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితాన్ని గడుపుతారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1983లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమల నాయక్‌పై  ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీ చేసిన గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. తొలిసారిగా ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

1985లో సీపీఐ అభ్యర్థి పాయం ముత్తయ్యపై రెండోసారి గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. 1989 లో సీపీఐ అభ్యర్థి ఊకే అబ్బయ్యపై  గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఊకే అబ్బయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి గుమ్మడి నర్సయ్యపై విజయం సాధించారు. 1999లో గుమ్మడి నర్సయ్య కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా దల్ సింగ్ పై విజయం సాధించారు.

2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాలోతు కల్పనాబాయ్ పై గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. 2009 లో టీడీపీ అభ్యర్థి ఊకే అబ్బయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యపై విజయం సాధించారు. 2014  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య టీడీపీ అభ్యర్థి బానోతు హరిప్రియపై విజయం సాధించారు.

ఆరు దఫాలు ఇల్లెందు నుండి గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. కానీ, ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. సైకిల్ పై తిరుగుతారు. బస్సుల్లో ప్రయాణం చేస్తారు.  

సంబంధిత వార్తలు

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు