అపార్ట్ మెంట్ పదో అంతస్తు నుంచి పడి యువతి మృతి : ఆత్మహత్యా..? హత్యా..?

Woman Suspicious Death In  abids
Highlights

యువతి మృతిపై పలు అనుమానాలు

హైద్రాబాద్ అబిడ్స్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మయూరి కాంప్లెక్స్ లోని పదో అంతస్తుపై నుండి పడి గుర్తు తెలియని యువతి మృతి చెందింది. అయితే ఈ యువతి మృతి పట్ల పను అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా గుర్తించిన పోలీసులు, ఈమెది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

అసలు ఈ యువతి ఎవరో తెలిస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. అందువల్ల యువతి వివరాల కోసం, ఈ అపార్ట్ మెంట్ లోకి ఎందుకు వచ్చింది, ఈ మరణం వెనును క వేరే మిస్టరీ ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టా

loader