జాకెట్ కోసం భర్తతో గొడవపడి.. మహిళ ఆత్మహత్య...
శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి బట్టలు టైలరింగ్ చేస్తూ చీరలు, బ్లౌజ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే భార్య విజయలక్ష్మికి ఇటీవల ఓ బ్లౌజ్ కుట్టాడు. అయితే తాను అడిగినట్టు కాకుండా వేరేలా కుట్టడంతో భార్యకు అది నచ్చలేదు. దీంతో భర్త మీద కోపానికి వచ్చింది. అది కాస్తా భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసింది. మాటా మాటా అనుకుని తీవ్రంగానే ఘర్షణ పడ్డారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణం జరిగింది. క్షణికావేశంలో ఓ భార్య suicide attemptకు పాల్పడింది. టైలర్ అయిన తన భర్త తనకు ఇష్టం వచ్చినట్లు blouse కుట్టలేదని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ముప్పై ఐదేళ్ల విజయలక్ష్మి తన కోసం కుట్టించిన బ్లౌజ్ విషయంలో భర్తతో గొడవపడి bed roomలో శవమై కనిపించింది. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెడితే... హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలోని గోల్నాక తిరుమల నగర్‌లో విజయలక్ష్మి, భర్త శ్రీనివాస్‌తో కలిసి ఉంటున్నారు. వీరికి స్కూలుకు వెళ్లి చదువుకునే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మామూలుగా వీరిది అన్యోన్య దాంపత్యం.
శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి బట్టలు Tailoring చేస్తూ చీరలు, బ్లౌజ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే భార్య విజయలక్ష్మికి ఇటీవల ఓ బ్లౌజ్ కుట్టాడు. అయితే తాను అడిగినట్టు కాకుండా వేరేలా కుట్టడంతో wifeకు అది నచ్చలేదు. దీంతో భర్త మీద కోపానికి వచ్చింది. అది కాస్తా భార్యాభర్తల మధ్య Conflictకు దారి తీసింది. మాటా మాటా అనుకుని తీవ్రంగానే ఘర్షణ పడ్డారు.
తనకు బ్లౌజ్ నచ్చలేదని సరిచేసి ఇవ్వాలని, Re-stitch చేయాలని శ్రీనివాస్ ను విజయలక్ష్మి కోరినట్లు సమాచారం. అయితే, అలా చేయడానికి అతను నిరాకరించాడు. ఊర్లో వారందరికి మంచిగా కుట్టి, తన దగ్గరికి వచ్చేసరికి ఇలా చేశావంటూ విజయలక్ష్మి కోపానికి వచ్చింది. ఇంట్లో టైలర్ అయిన భర్త ఉండి.. తనకు బ్లౌజ్ సరిగా కుదరకపోవడంతో విజయలక్ష్మి మనస్తాపం చెందింది.
అంతే భర్త బైటికి వెళ్లిన తరువాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్ తలుపులు వేసి ఉండడం గమనించారు. వారు ఎంతసేపు తలుపులు కొట్టినా తీయలేదు. లోపల్నించి ఎలాంటి స్పందన లేదు. ఇది గమనించి స్థానికులు కూడా వచ్చి చూశాడు. చేసేదేం లేక.. శ్రీనివాస్‌కు సమాచారం అందించారు.
మూడో భార్య కోసం.. రెండో భార్య మీద క్షుద్రపూజలు...!!
వ్యాపారం నిమిత్తం బైటికి వెళ్లిన శ్రీనివాస్ వెంటనే ఇంటికి వెళ్లి చూడగా బెడ్ రూం తలుపు లోపల నుంచి గడియపెట్టి ఉండడం గమనించాడు. శ్రీనివాస్ కూడా ఎంతగా ప్రయత్నించినా, సమాధానం లేకపోవడం.. తలుపులు తీయకపోవడంతో శ్రీనివాస్ బలవంతంగా బద్దలు కొట్టాడు. అయితే, అప్పటికి విజయలక్ష్మి మృతి చెందింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసి అందరూ విస్తుపోతున్నారు.
అంత చిన్న విషయానికి నిండు జీవితాన్ని బలి చేసుకుందని, ఇద్దరు చిన్నారులను అనాథలను చేసి పోయిందని తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చర్చనీయాంశంగా మారింది.