మూడో భార్య కోసం.. రెండో భార్య మీద క్షుద్రపూజలు...!!
కుమార్ ఇటీవలే మరో మహిళను మూడో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్యను వదిలేయడంతో అడ్డుతొలిగింది. కానీ రెండో భార్యను వదిలేయలేదు.. దీంతో మూడో భార్యతో తన బంధానికి రెండో భార్య గోపిక అడ్డుగా ఉందనుకున్నాడు. అందుకే ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. మామూలుగా చంపితే తన మీద అనుమానం వస్తుందనుకున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పాల్వంచ పట్టణంలో Witchcraft కలకలం రేపాయి. ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ.. కొత్త భార్య కోసం అంతకు ముందు భార్యలను హతమారుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే third wife కోసం, second wifeను చంపాలని దారుణమైన పథకం వేశాడు. రెండో భార్య గోపికను murder చేసేందుకు భర్త క్షుద్ర పూజలు చేయించడం స్థానికంగా సంచలనంగా మారింది.
కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయించడం, దీనికోసం సుపారీ ఇవ్వడంలాంటివాటితో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదంతా జరిగింది కూడా ఎక్కడో మారుమూల పల్లెల్లో అయితే.. ఇంకా అజ్ఞానంలో ఉన్నారనుకోవచ్చు. కానీ అది జరిగిందిజిల్లా కేంద్రానికి అతి దగ్గరలో.. కాస్తో, కూస్తో చదువుకున్నవాడే ఇలా చేయడం, ఈ పూజలు వెలుగు చూడడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే…
పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శేఖరబంజరకు చెందిన కుమార్ auto driver గా పని చేస్తున్నాడు. ఈయన కొన్నేళ్ళ క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు, ఇద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయి అనే వివరాలు తెలియవు. ఆ తరువాత gopika అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. తరువాత మెల్లిగా ఆమె దగ్గర ఉన్న బంగారం డబ్బు మొత్తం కాజేశాడు.
చిత్తూరులో ఘోర ప్రమాదం: డివైడర్ ను ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఇక ఆమెతో పనిలేదనుకున్నాడేమో.. మరో మహిళను మూడో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్యను వదిలేయడంతో అడ్డుతొలిగింది. కానీ రెండో భార్యను వదిలేయలేదు.. దీంతో మూడో భార్యతో తన బంధానికి రెండో భార్య గోపిక అడ్డుగా ఉందనుకున్నాడు. అందుకే ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. మామూలుగా చంపితే తన మీద అనుమానం వస్తుందనుకున్నాడు.
తన చేతికి మట్టి అంటకుండా చంపాలనుకున్నాడు. దీనికోసం ఆమెను హతమార్చేందుకు తాంత్రిక మాంత్రికుడితో సుఫారీ మాట్లాడుకుని క్షుద్ర పూజలు చేయించాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించుకుంది. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ పూజల తతంగం అంతా స్థానికులు గమనిస్తున్నారు. కుమార్ పద్ధతిపై, తరచుగా పెళ్లిళ్లు చేసుకుంటూ భార్యల్ని వదిలేయడంపై వారూ ఫిర్యాదు చేస్తున్నారు. జీవితాంతం తోడు ఉంటానని పెళ్లి చేసుకుని.. కట్టుకున్న భార్యనే కడతేర్చడానికి దారుణమైన పనికి ఒడిగట్టిన కుమార్ మీద ఆగ్రహంతో ఉన్నారు. అందుకే స్థానికులు కూడా బాధితురాలికి అండగా నిలిచారు.
పేదలకు రూ.10 వేల కోట్ల లాభం.. కానీ, ఓటీఎస్ స్కీమ్‌పై చంద్రబాబు కుట్ర : మంత్రి శ్రీరంగనాథరాజు
ఇలా వరుస పెళ్ళిళ్లు చేసుకుంటూ అమాయక మహిళలు మోసం చేస్తున్నాడని, ఈ నిత్య పెళ్ళికొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కోరుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు పోలీసులు స్పందించకపోవడం గమనార్హం.