హైదరాబాద్, రాయదుర్గం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను మరో మహిళ కర్కషంగా అంతమొదించింది. వీరిద్దరికీ భర్త ఒకటే కావడం విశేషం. వివరాల్లోకి వెడితే..

యదుర్గం పీఎస్ పరిధిలోని పోచమ్మ బస్తీకి చెందిన భాస్కర్ కు జానకి, స్రవంతి అని ఇద్దరు భార్యలున్నారు. జానకి పెద్ద భార్య, కాగా స్రవంతి చిన్న భార్య. అయితే పెద్ద భార్య జానకి తన వైవాహిక జీవితానికి చిన్న భార్య స్రవంతి  అడ్డు వస్తుందనే కోపంతో ఆమెను హత్య చేసింది.

కుటుంబ విషయాలు మాట్లాడాలంటూ భర్త ఇంట్లోనే లేని సమయంలో స్రవంతిని జానకి ఇంటికి పిలిపించింది. అమాయకంగా ఇంటికి వచ్చిన స్రవంతిని తమ్ముడు వరసైన గుండా లక్ష్మీ నారాయణతో కలిసి మెడకు చున్నీ బిగించి జానకి హత్య చేసింది. 

భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణమైన నిందితులు  జానకి, లక్ష్మీ నారాయణలను అరెస్టు చేసి రాయదుర్గం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.