ప్రేమ పేరుతో మాయ మాటలు  చెప్పి.. నమ్మించి ఓ యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా... యువతి స్వస్థలం హన్మకొండ. కాగా... తనపై జరిగిన దాడికి యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే....హన్మకొండ జులైవాడకు చెందిన 32ఏళ్ల యువతికి వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన పెరుమాళ్ల జీవన్‌ సందీప్ తో  2018 నుంచి పరిచయంఉంది. ఆ యువతి సికింద్రాబాద్‌లోని కేథలిక్‌ చర్చిలో ఉద్యోగం చేస్తోంది. గతనెల 18న బాధిత యువతి మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్లింది. విషయం తెలుసుకున్న జీవన్‌ కూడా అక్కడికి వెళ్లాడు. ఢిల్లీలో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

AlsoRead వరంగల్ లో దారుణం: మూడేళ్ల చిన్నారిపై 80ఏళ్ల తాత... అత్యాచారయత్నం.
 
ఈ దారుణ ఘటనతో ఆ యువతి షాక్‌కు గురవ్వగా.. నిందితుడు ఆమెను సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు, హన్మకొండలోని ఆమె ఇంటి వద్ద దించి వెళ్లాడు. ఆ యువతి వింతగా ప్రవర్తిస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆమెతో పాటు ఢిల్లీ వెళ్లిన స్నేహితురాళ్లతో మాట్లాడి.. జీవన్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ మేరకు సుబేదారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు