మూడేళ్ల చిన్నారిపై  80ఏళ్ల వృద్ధుడు  అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ దారుణ సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. కాగా... గమనించిన స్థానికులు ఆ వృద్ధుడిని చితకబాది.. చిన్నారిని కాపాడారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ లోని  ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి.. రాత్రి 7గంటల సమయంలో... ఇంటి ముందు ఆడుకోవడానికి బయటకు వచ్చింది. చిన్నారి ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు టి.కేదారి(80) కన్ను.. ఆ చిన్నారిపై పడింది.  ఇంట్లో ఎవరూ చూడకుండా చిన్నారిని కిడ్నాప్ చేశాడు.

ఎవరూ చూడని ప్రాంతానికి చిన్నారిని తీసుకువెళ్లి... అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే... అతను చేస్తున్న పనిని ఆ కాలనీవాసులు కొందరు గుర్తించారు. వెంటనే... చిన్నారిని రక్షించారు. నిందితుడు కేదారిని పట్టుకొని పోలీసలుకు అప్పగించారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాగా... చిన్నారిపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు... హాస్పిటల్ కి తరలించారు. పోక్సో చట్టం కింద అతని పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.